Yesu Kreestu puttenu nedu

యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో 

మిలమిల మెరిసే అందాల తార వెలసెను గగనములో /2/

ఇది పండుగ క్రిస్మస్ పండుగ – జగతిలో నిండుగ వెలుగులు నిండగ /యేసు/

1.పాపరహితునిగా శుద్హాత్మ దేవునిగా /2/

కన్య మరియకు వరసుతునిగా – (ఈ) జగమునకరుదెంచెను /2/ఇది/

2.సత్యస్వరూపునిగా – బలమైనదేవునిగా /2/

 నిత్యుడైన తండ్రిగా (ఈ) అవనికి ఏతెంచెను /2/ఇది/

3.శరీరధారిగా – కృపగల దేవునిగా /2/

పాపులపాలిట పెన్నిధిగా -(ఈ) లోకమునకు వచ్చెను /2/ఇది/