ఉత్సాహ గానము చేసెదము – ఘన పరచెదము మన యేసయ్య నామమును /2/ హల్లెలూయ యెహోవ రాఫా – హల్లెలూయ యెహోవ షమ్మా హల్లెలూయ యెహోవ ఈరే – హల్లెలూయ యెహోవ షాలోమ్ /2/ 1. అమూల్యములైన వాగ్ధానములు – అత్యధికముగా ఉన్నవి /2/ వాటిని మనము నమ్మిన యెడల – దేవుని మహిమను అనుభవించెదము /2/హల్లె/ 2. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్ని వాగ్ధాన ఫలములెగా అత్మాభిషేకము సమృద్ధిగా పొంది – ఆత్మీయ వరములు అనుభవించెదము /2/హల్లె/ 3. వాగ్ధాన దేశము పితరులకిచ్చిన – నమ్మదగిన దేవుడాయన /2/ జయించిన వారమై అర్హతపొంది – నూతన యెరుషలెమ్ అనుభవించెదము /2/హల్లె/