Fathers day skit in Telugu (tappipoyina kumaarudu kata)

Characters:

  1. Father

  2. Son1

  3. Son2

  4. Friend 1

  5. Friend 2

  6. Police

  7. Father’s secretary ​

Scene1

తండ్రి: తన ఆఫీస్ ఫైల్స్ తో  బిజీగా వుంటాడు అప్పుడే ఆఫీస్ రూమ్ లోనికి సెక్రటరీ వచ్చి 

సెక్రటరీ: సార్ మిమ్మల్ని ఎవరు కలవడానికి కుదరదని మీరు చెప్పారు కానీ.. 

తండ్రి: ఆ కాని ఏంటి త్వరగా చెప్పు నాకు చాలా పని వుంది   

సెక్రటరీ: మీ అబ్బాయి వచ్చారు సార్ 

తండ్రి: ఔనా! అదేంటి పొద్దున్నే మీటింగ్ అయ్యింది కదా, ఏవైనా సమస్యలు ఉంటే చెప్పమన్నాను, అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ తో  పాటు తను కూడా వున్నాడు కదా మరలా ఎందుకొచ్చాడు, ఏమైనా చెప్పాడా?

సెక్రటరీ: మీ పెద్ద అబ్బాయి కాదు సార్, ఆయన ఇప్పుడు బ్యాంకర్స్ తో మీటింగులో బిజీగా వున్నారు, వచ్చింది మీ చిన్నబ్బాయ్ 

తండ్రి: ఔనా! సరె సరె, లోపలికి రమ్మను 

సెక్రటరీ: ఓ కే సార్ 

Son2: హలో డాడ్ ఎలా వున్నారు?

తండ్రి: I’m fine, how are you son! ఇంకా కాలేజీ హాలిడేస్ టైమ్ రాలేదుకదా అప్పుడే వచ్చావేంటి?

Son2: Dad మీరు last year అన్నయ్య నేను మీరు వున్నపుడు ఒక విషయం మాట్లాడారు గుర్తుందా?

తండ్రి: దేనిగురించి మాట్లాడామో గుర్తు రావట్లేదు, కాస్త వివరంగా చెప్పు 

Son2: మీరు ఆరోజు అన్నారు మేము ఇక త్వరలో బిజినెస్ విషయాలు చూసుకోవాలని, బాధ్యతలన్నీ మేమే తీసుకోవాలని ఇక మీరు రిటైర్ అవ్వుదామని అనుకుంటున్నారని … 

తండ్రి: అవును, నాకు గుర్తొచ్చింది. already మీ అన్నయ్య కంపెనీ పనుల్లో బాగా involve అవుతున్నాడు, అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు, ప్రతి department meeting attend అవుతున్నాడు. 

Son2: అదే Daddy నేను కూడా ఒక business పెట్టనుకొంటున్నాను, ఆ విషయమే మీతో మాట్లాడాలని వచ్చాను 

తండ్రి: oh అలాగా, మంచిదే. ఐనా మన company ఇప్పుడు బాగానే నడుస్తుంది కదా, ఇంకొక company పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా నీ college studies complete కావటానికి minimum 3 years పడుతుంది. 

Son2: ఇవన్నీ నాకు తెలుసు Dad, నేను చెప్పేది మీకు సరిగ్గా అర్ధంకాలేదు అనుకుంటున్నాను, I want to stand on my own, 

తండ్రి: అదికాదు, నేను చెప్పేది విను, నీకింకా పెద్దగా అనుభవం లేదు … 

Son2: Oh! Common Dad, listen I am very  clear  in this “I want my share in the property as  promised by you” . 

తండ్రి:    మరి నీ college studies పరిస్థితి ఏంటి 

Son2:  అదంతా నేను చూసుకుంటాను, నా 3 years, college  fees 23k for  each  year, so నాకు 70k fees కావాలి. ఇంకా ఆస్తిలో నాకు రావలసిన వాటా నాకివ్వండి నా plans నాకున్నాయి                                         

తండ్రి: O.K. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను ఇంక చేసేదేమిలేదు, మన auditor తో మాట్లాడి నీకు రావలసింది settle చేస్తాను

Son2:    OK, thank you Dad.                                    

తండ్రి: ఒకవేళ నీకు ఏమైనా accounts లో help కావాలంటే అడుగు, మన దగ్గర city లోనే top  most accountants వున్నారు   

Son2: No, No, that’s fine. Leave that to me. Ok Dad by for now.. 

    

Scene2

(Based on Verse: Luke 15:13)

“A few days later, this younger son packed all his belongings and took a trip to a distant land, and there wasted all his money on parties and prostitutes.”

Son2: (only action) he packs everything take his credit cards/debit cards, all his money belongings, carry a back pack and join his friends to a holiday trip to dream city London to plan his future and new startup ideas while on holiday.  

in a fast pace music background Son2 stay in a London star hotel room with his 2 friends enjoying a drink and a dialogue 

Friend1: ఈ రోజు మనము ఎంత సంతోషంగా ఉన్నాం! దీనంతటికి మన ప్రాణ స్నేహితుడు రాజు (son2) కారణం కదా  

Friend2: అవునురా ఈ శుభ సందర్భంలో మనం కొంచెం కాదు కాదు చాలా enjoy చేయాలి. అందరం ఈ beer తాగి ఎంజాయ్ చేద్దాం (aaj ka raat Raj ka naam) 

Friend1: రాజు నాకు ఇక్కడ city లో enjoy చేయడానికి ఏమేమి వుంటాయో నాకు బాగా తెలుసు . Morning అందరం కలిసి casino కు వెళదాం 

Son 2: Casino  అంటే ఏంటి?

Friend 2: రాజ్! తొందర ఎందుకురా నువ్వే చూస్తావుగా 

(fast backdrop లో బెట్టింగ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నట్లు firneds అందరు  కొంత action  చేస్తారు )

Son2(రాజ్): ఒరేయ్ చాల డబ్బులు అయిపోయినయ్ కానీ ఏమి profit రాలేదు నాకు టెన్షన్ గా వుంది 

Friend 1: business లో ఇవన్నీ common రా నువ్వేమి ఎక్కువగా టెన్షన్ ఫీలవ్వకు, ఇప్పుడు పొతే రేపొస్తాయ్ 

Friend 2: ఏంటిరా 

Friend 1: money, profit ! అందరు అంటారుకదా అదేంటి ఎక్కడ పొతే అక్కడే వెతుక్కోవాలని 

Son 2: సరేరా ఈరోజుకు చాలు మరల రేపోద్దాం 

Friend 1: ఒరేయ్ నాకు తెలిసిన ఒక మంచి business man వున్నాడు, అతను చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ plans చెపుతాడు, మనకు త్వరగా డబ్బులు వచ్చే టైపులో business  plan అడుగుదాం, OK !

Son 2: సరేరా రేపు కలుద్దాం 

(Next day morning business man, చాలా బిజీగా ఫోన్లో మాట్లాడుతూ, iPad లో చాటింగ్ చేస్తూ , లక్షలు, కోట్లు maney  గురించి మాట్లాడుతూ ఉంటాడు )

Friend 1: ఒరేయ్ రాజు చూసావా అతను ఎంత బిజీగా వున్నాడో, just నేను అడిగానని నీకోసం వచ్చాడు 

Business man : ఆ ఏమిటి విషయం, ఎన్ని కోట్లు invest చేద్దాం అనుకుంటున్నారు, నాకు టైం లేదు త్వరగా deal  మాట్లాడేద్దాం, అవతల నాకొక urgent bbusiness  meeting వుంది! నా friend చాలా బలవంతం చేసాడని వచ్చాను 

Son 2: Sir ఇంతకీ బిజినెస్ ప్లాన్ ఏంటో కాస్త చెపుతారా? (కాస్త భయంగా)

Business man : అరె! ఏంటిది sam? మీ friend కి చెప్పలేదా? business plan ? నాకు అంత time లేదని నీకు తెలుసు కదా! మాది ఒక సినిమా poduction company, మేము మా banner లో చాలా movies chesaam  దాదాపు అన్ని super హిట్స్! మన bethel church లో prasad అని వున్నాడుకదా అదేనయ్యా movie director ఆయన మనదగ్గరే వుంటాడు, ఇంకా అదేంటి బాహుబలి 1,2 ఇంకా 3 కూడా ప్లాన్ చేస్తున్నాం. మీ ఇష్టం interest ఉంటే ఇక్కడ sign చెయ్యండి , ఇక నాకు టైంలేదు నేను వెళ్ళాలి 

Son2: ఒకసారి మా dad company accountant తో మాట్లాడి.. 

 Business man : సరే మీరు వేరే plan చూసుకోండి, నాకు టైమే లేదు వీలైతే next year చూద్దాం అదికూడా Sam గురించి 

Son 2: ఆ.. సరే sign చేస్తాను ఇవ్వండి 

Business man : papers తొందరగా sign చేయించుకుని వెళ్ళిపోతాడు 

(Music backdrop లో party with friends ) (చీకటి పడుతుంది అందరు నిద్రలోకి వెళ్ళిపోతారు           

  

Scene:3

Luke 15:14-16, where Jesus tells us how grim and hopeless were the young man’s circumstances, with these words: The words of Luke 15: 14-19 are projected on the wall, above the stage, or on the curtain, as narrator reads:

“After he had spent everything, there was a severe famine in that whole country, and he began to be in need.  So he went and hired himself out to a citizen of that country, who sent him to his fields to feed pigs.  He longed to fill his stomach with the pods that the pigs were eating, but no one gave him anything.”

Clearly, the son had hit bottom. His money was gone.  His friends were gone.  His opportunities were gone.  One Scripture translation tells us that he “forced himself” on a citizen of that country to find even the most degrading job imaginable to the people of Jesus’ time: feeding pigs.

Son 2: (రోడ్ పక్కన కూర్చుని evening standard paper చదువుతూ ఏమైనా jobs ఉన్నాయేమో అని చూస్తుంటాడు, ఏమి suitable jobs లేకపోయేసరికి అలానే తాగి పడుకునిపోతాడు )

police : హేయ్! లే, ఇక్కడ వుండకూడదు, ఇక్కడినించి వెళ్ళు, ఛి! తాగడం రోడ్లమీద దొర్లడం , ఇదేపని వెధవలకు! ఫో ఇక్కడినించి!

Son 2: అక్కడినించి లేచి మరొక హోటల్ దగ్గర పని కోసం వెళతాడు, అక్కడ వాళ్ళు dish washing job ఇస్తారు. పని అంతా అయ్యిన తరువాత మిగిలినవి తింటూ ఏడుస్తుంటాడు             

Scene:4

Father: ఆఫీసులో files చూస్తూ  meeting లో బిజీగా  ఉంటాడు, చాల important మీటింగ్ కావడంతో ఎవ్వరిని లోపలి పంపవద్దని secretary కి ఆర్డర్ చేస్తాడు.

Secretary: తలుపు తోసుకుని లోపలి వచ్చి అంటుంది (ఒక అర్జెంటు information sir )

Father; ఏంటిది! నేను చెప్పాను కదా , ఎవ్వరిని లోపలికి రానివ్వద్దని, ఐనా సరే ఎందుకు వచ్చావు, ఇక్కడ ఇంట పెద్ద డీల్ సెటిల్ చేస్తుంటే రాకూడదని తెలీదా

Secretary : అదికాదు sir మీ చిన్నబ్బాయ్ … 

Father : ఆ అబ్బాయ్ ! వాట్ చిన్నబ్బాయ్ ?, ఫోన్ చేశాడా?

  Secretary : అవును sir, ఇంటికి వస్తున్నాడంట,  మన hathrow station దగ్గరే ఉన్నాడంట, ఇంటికి రావడానికి పర్మిషన్ ఇస్తారేమో అడగటానికి ఫోన్ చేశారు, లేకపోతె బయటే ఏదైనా చిన్న రూంలో ఉండి మీదగ్గర ఏదైనా driver జాబ్ ఉంటే అదైనా చేస్తానంటున్నాడు సర్!

Father : (కన్నీరు నిండిన కళ్ళతో) ఆ.. ఈరోజు నాకు urgent  పనివుంది దయచేసి మీరంతా వెళ్ళండి (అని అందర్నీ పంపించి వేస్తాడు) 

(secretary ని పిలచి ) ఆ station దగ్గరే వుండమని చెప్పు ఒక గంటలో మన benz కారు పంపిస్తానని చెప్పు, కాదు కాదు, ఒక అరగంటలో పంపిస్తానని చెప్పు, లేదు లేదు వెంటనే మన డ్రైవర్ని Ferrari తీసుకుని వెళ్ళమను, వద్దు వద్దు నేనే వెళతాను తొందరగా నా rangerover రెడీ చెయ్యండి, ఆ నా valet, సూట్ అన్ని రెడీ చెయ్యండి 

ఆ చెప్పడం మరిచిపోయాను, urgent గా ఒక suit with tie, shoes, అన్ని వాడికి రెడీ చెయ్యండి. 

Secretary వాడికి ఫోన్ సేసి చెప్పు iam ఫీలింగ్ వెరీ హ్యాపీ, he made my day , కాదు కాదు, he  made  my year. 

ఈవెనింగ్ bankers meeting లో వాడు నాతో పాటు కూర్చోవాలి, అన్ని రెడీ చెయ్యండి 

Scene:5 

(తండ్రి కారు దిగి స్టేషన్లోకి వెళ్లి చుట్టూ చూస్తూ అంతా ఆత్రంగా చూస్తూవుంటాడు ఇంతలో ఒక మూలాన bench పై చినిగిన బట్టలతో మాసిన జుట్టు తో దీనంగా కూర్చునివున్న తన కొడుకును చూస్తాడు, వెంటనే పరుగు పరుగున తన కుమారుడివైపు వెళ్తూవుంటాడు)

Son2: 

(అది చుసిన కుమారుడు భయంగా బాధగా మొఖం పెట్టి sir నన్ను క్షమించండి, మిమ్మల్ని తండ్రి అని పిలిచే అర్హత కూడా నాకు లేదు, నాదగ్గరకు రావద్దు )

Father :

నా Raj ఎన్నిరోజులయ్యింది నిన్ను చూసి, ప్రతిరోజూ నీకోసం ఎదురు చూస్తున్నాను, నీవెప్పుడు వస్తావో అని. 

నన్ను Dad  అని పిలువు Raj, నీవెప్పుడూ నా కుమారుడివే !

Son2:

Dady  నీ ప్రేమను నీ విలువను తెలుసుకోలేక నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను, కాని నీకు వేరుగా నేనేమి సాధించలేనని తెలుసుకున్నాను 

  Father: (మోకాళ్లపై పడి  ఆకాశం వైపు కన్నులెత్తి )

తండ్రి నీకు స్తోత్రమ్, వందనాలు, వందనాలు, thank you Lord , (కళ్ళలో నీళ్లతో కుమారుడిని చూస్తాడు)

కుమారుడు ఆనందంగా తండ్రిని హత్తుకుంటాడు 

Father : Raj ఇంకేం మాట్లాడకు, నాకేమి వినాల్సిన అవసరం లేదు, నువ్వొచ్చావ్, నాకంతే చాలు!

Closing 

( తండ్రి , కుమారుడు, ఒకరినొకరు హత్తుకుని మాట్లాడుకుంటూ స్టేజి మీదనుంచి వెళ్ళిపోతారు వారి వెనకాలే అందరు నడుస్తారు)

 

 

Credentials: Script narrated by: Praveen 
Bible verse base: Luke Chapter 15
Share with your friends if you like and be blessed