F                    C              Bb                     F                      

రండి సువార్త సునాదముతో – రంజిలు సిలువ నినాదముతో 

Am           Bb      F         C                  C7          F                               

తంబుర సితార నాదముతో – ప్రభుయేసు దయానిధి సన్నిధికి

F                        Bb                C                F    

1. యేసే మానవజాతి వికాసం-యేసే మానవ నీతి విలాసం

Am           Bb                 F       C                   F

యేసే పతిత పావన నామం – భాసుర క్రైస్తవ శుభనామం #రండి#

    

2. యేసే దేవుని ప్రేమ స్వరూపం – యేసే సర్వేశ్వర ప్రతిరూపం 

యేసే ప్రజాపతి పరమేశం – ఆశ్రిత జనముల సుఖవాసం #రండి#

3. యేసే సిలువను మోసిన దైవం – యేసే ఆత్మల శాశ్వత జీవం 

యేసే క్షమాపణ అధికారం – దాసుల ప్రార్ధన సహకారం #రండి#

4. యేసే సంఘములో మన కాంతి – యేసే హృదయములో ఘనశాంతి 

యేసే కుటుంబ జీవన జ్యోతి – పసిపాపల దీవెన మూర్తి #రండి#

5. యేసే జీవన ముక్తికి మార్గం – యేసే భక్తుల భూతల స్వర్గం 

యేసే ప్రపంచ శాంతికి సూత్రం – వాసిగ నమ్మిన జనస్తోత్రం #రండి#