Yenduko Nannintaga neevu song lyrics ఎందుకో నన్నింతగా నీవు – ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర – హల్లెలుయ యేసయ్య 1.నా పాపము బాప నరరుపివైనవూ నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే – నా స్తానములో నీవే 2.నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించమన్నావు నీవు నన్ను ఎన్నుకొన్నావు -నీ కొరకై నీ కృపాలో 3.నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకోన్నావు నన్ను నీలో చేర్చుకొన్నావు నను దాచి యున్నావు 4.నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సంతసము నీలో నీవు నేను ఏకమగు వరకు – నను విడువనంటివి దేవా 5.నా మనవులు ముందే – నీ మనసులో నెరవేరె నా మనుగడ ముందే – నీ గ్రంధములో లోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నీకేమి చెల్లింతు