Premalo paddanu nenu premalo paddanu Song lyrics in Telugu and English ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను … ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను ప్రేమలో వున్నాను నేను ప్రేమలో వున్నాను నా యేసు ప్రభుని ప్రేమలో వున్నాను స్వార్ధం కలిగిన ప్రేమకాదు – లాభంకోరే ప్రేమకాదు కొద్ది కాలమే వుండే ప్రేమకాదు – ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ మొహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమకాదు పై అందం చూసే ప్రేమకాదు – పరిశుద్ధమైన ప్రేమ ఇదేకదా ప్రేమంటే – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో / 1. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు – నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరచె మొదటగా ప్రేమించింది నేను కాదు – నా యేసే తన ప్రేమ వ్యక్తపరచె కోరినాడు – పిలిచినాడు – నేను ఏదో మంచి వ్యక్తి నైనట్టు ! కుమ్మరించె ప్రేమమొత్తం – నేను తప్ప ఎవ్వరూ లేనట్టు ! ఆకాశాన తనలోతాను – పరిపూర్ణునిగా వున్న ప్రభువుకు భువిలో నాపై ప్రేమ ఎందుకో ! ఏమి తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవిపైన – ప్రభువుకు అంత ప్రేమ దేనికో! హే ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక – నేను ప్రేమించకుండ ఎట్ల వుంటాను అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి I love you చెప్పకుండ ఎట్లగుంటాను ఇదేకదా ప్రేమంటే – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో / 2. తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే – నా ప్రియుడు తన ప్రేమ ఋజువు పరచే తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే – నా యేసు తన ప్రేమ ఋజువు పరచే పాపమనే కూపమందు నేను బందీనై యుండఁగా – పాపమనే అప్పుచేత బానిసై నేను అలసి యుండఁగా గగనపు దూరము దాటివచ్చి – సిలువలో చేతులు పారచాపి – నువ్వంటే నాకింత ప్రేమనే ! రక్తముతో నను సంపాదించి – నాకళ్ళళ్ళో కళ్ళు పెట్టి – నీపై పిచ్చి ప్రేమ నాకనే హే నన్ను తన సొత్తు చేసుకున్నాడు – నా పాపకట్లు తెంచి స్వేఛ్చ నిచ్చాడు మరల వచ్చి పేళ్ళి చేసుకుంటాడు – అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ఇదేకదా ప్రేమంటే – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో / 3.ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ – వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ ప్రేమతో నా యేసు వ్రాసెను ప్రేమలేఖ – వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ ఆ లేఖ చదువుతుంటే, నా ప్రియుని తలపులే నాలో నిండె ప్రభుని ప్రేమ లోతు తెలిసి, నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే రేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసుండాలని నా ప్రాణము పరితపించెనే! యుగయుగములు నన్నేలెడి వాడు, అతి త్వరలోనే రానున్నాడని ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే! హే! వింతయైన నా యేసు ప్రేమ గూర్చి నేను – సర్వలోకమునకు చాటి చెపుతాను యేసు రక్తమందు శుద్ధులైన వారే – ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను ఇదేకదా ప్రేమంటే – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో / Lyrics in English Premalo paddanu… Nenu premalo paddaanu… Premalo paddanu nenu premalo paddanu, naa Yesu prabhuni premalo paddanu Premalo unnanu nenu premalo unnanu, naa Yesu prabhuni premalo unnanu Swardham kaligina prema kaadu – Laabham kore prema kaadu Koddi kaalame vunde premakaadu – Aa saaswatamaina Yesuni prema Moham kaligina premakaadu – Mosam chese preamakaadu Pai andam chuse premakaadu – Parishuddhamaina prema Ide kadaa preamate – Ide kadaa Premante – Ee loka premakaadu, Agaape prema – Devuni prema idi /premalo/ 1. Modatagaa Prapose chesindi nenu kaadu – Naa priyude tana prema vyaktaparache Modatagaa preminchindi nenu kaadu – naa Yese tana prema vyaktaparache Korinaadu, pilachinaadu, nenu yedo manchi vyakthi nainattu! Kummarinche Premamottam – Nenu tappa yevvaru lenattu! Aakaashaana tanalo taanu – paripoornunigaa unna prabhuvuku, bhuvilo naapai prema yenduko! Yemi tirigi ivvaleni ee chinna jeevipaina – prabhuvuku anta prema deniko! Hey inta goppa prema ruchi chusaka – Nenu preminchakunda yetla vuntaanu Anta goppa prema chupu premikuniki I love you cheppakunda yetlaguntaanu Ide kadaa premante – Ide kadaa premante – Ee loka prema kaadu Agaape prema – Devuni prema idi /premalo/ 2. Tana premaku rujuventani nenadugaka munupe – Naa priyudu tana prema rujuvu parache Tana premaku rujuventani nenadugaka munupe – Naa Yese tana prema rujuvu parache Paapamane kupamandu nenu bandheenai yundangaa – Paapamane appu cheta baanisai nenu alasi yundanga Gaganapu duramu daativachhi – Siluvalo chetulu paarachaapi – Nuvvante naakinta premane! Rakthamutho nanu sampaadinchi – Naa kallallo kallu petti – Neepai pichhi prema naakane! hey nannu tana sottu chesukunnadu – Naa papa katlu tenchi swecha nichhaadu marala vachhi pelli chesukuntaadu – Ani nischitaardham chesukuni velladu Ide kadaa premante – ide kadaa Premante – Ee loka prema kaadu Agaape prema – Devuni prema idi /premalo/ 3. prematho Naa priyudu vraasenu premalekha – vaakyamane Parishuddha premalekha /2/ aa lekha chaduvutunte, naa priyuni talapule naalo ninde Prabhuni prema lotu telasi, naa Yesu pai prema pongi porale Reyimbavalu prabhu kaavaalani, tanato Yeppudu kalisundaalani -Naa praanam paritapiyinchene! Yugayugamulu nanneledi vaadu, atitwaralone raanunnadani – Aatmalo kalige prema pravavasame Hey vintayeina naa Yesu prema gurchi nenu – Sarvalokamunaku chaati cheputaanu Yesu rakthamandu Shudhulaina vaare – aa prema raajyamandu vundurataanu Ide kadaa premante – ide kadaa Premante – Ee loka prema kaadu Agaape prema – Devuni prema idi /premalo/ Credentials: Lyrics, compose and sung by: Bro. Anil Kumar Album: Yese Saswata Prema