బేధం ఏమి లేదు! – అందరును పాపం చేసియున్నారు, 
దేవాదిదేవుడు ఇచ్చే ఉన్నత మహిమను – పోగొట్టుకున్నారు /2/
ఏ కులమైన మతమైన జాతైన రంగైన – దేవుని దృష్టిలో అందరు పాపులే /2/బేధం/

1. ఆస్తి పాస్తులు ఎన్నున్నా – నిత్యరాజ్యము నీకివ్వవు 
విద్యార్హతలు ఎన్నున్నా – సంతోషాన్ని నీకివ్వవు 
సమసిపోయే ఈలోకము – ఆశ్రయాన్ని నీకివ్వదు 
తరిగిపోయే ఈ కాలము – కలవరాన్ని తీర్చదు 
నీవేవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా 
యేసులేకుంటే నీకున్నవన్ని సున్న /2/బేధం/

2. పుణ్యకార్యాలు చేసినా – పవిత్రత నీకు రాదుగా 
తీర్ధ యాత్రలు తిరిగినా – తరగదు నీ పాపము 
పరమును వీడిన పరిశుద్ధుడేసు – రక్తము కార్చెను సిలువలో 
కోరికోరి నిను పిలిచెను – పరమ రాజ్యము నీకివ్వగ 
నీ స్థితి ఏదైనా – గతి ఏదైనా వృత్తేదైనా భ్రుతి ఏదైనా 
కలువరి నాధుడే రక్షణ మార్గము /2/బేధం/

 

Credentials: Written and Sung by Dr. John Wesley

Music: Bro.Jona