గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము 

యేసురాజు లేచెను – హల్లెలుయా – జయ మర్భాటించెదము#2#గీతం#

 

1. చూడు సమాధిని మూసిన రాయి – దొరలుచు పోరలిడెను 

అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు #2#గీతం#

 

2. వలదు వలదు ఏడువవలదు – వెళ్ళుడి గలిలయకు 

తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి#2#గీతం# 

 

3. అన్న కయప వారల సభయును – ఆదరుచు పరుగిడిరి 

ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి#2#గీతం#

 

4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి – జయవీరుడు రాగా 

మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి #2#గీతం#