Emmanuelu Jananam Christmas song lyrics Click here for this song Chords పల్లవి : ఇమ్మానుయేలు జననం – పరిశుద్ధతకే సంకేతం పరమాత్ముని ప్రేమస్వరూపం – ప్రజలందరి రక్షణ మార్గం “ప్రభువు తేజము వెల్లివిరిసెను – లోకమంతా పండుగాయెను దీన జనులకు – అనుదినమంతా” 1.ప్రభువు నీకు తోడైయుండగ పొందితి దేవుని కృపలని పరిశుద్ధాత్మతో గర్భము ధరించి ఆయన శక్తిని కమ్ముకొని పరిశుద్ధునిగా పుట్టిన శిశువే సర్వోన్నతునిగ నిలుచునని పంపబడిన దేవదూత చెప్పెను – కన్య మరియకు శుభమని //ఇమ్మానుయేలు// 2.ఇశ్రాయేలను ప్రజలను పరిపాలించే అధిపతి బేత్లెహేమను ఊరి సత్రములో – యూదుల రాజుగ యేసు పుట్టెను పొత్తిగుడ్డలతో చుట్టి యేసుని పశువుల తొట్టిలో పరుండబెట్టిరి ఆయన జన్మకు ఆనవాలుగా తూర్పున ఓ తార ఉదయించెను //ఇమ్మానుయేలు// 3.పాపుల రక్షణ పరమార్ధముగా యేసు పుట్టెనని తెలుసుకొని తూర్పు దేశపు జ్ఞానులాయనను పూజింపగా వచ్చితిమని ఇంటినిజొచ్చి తల్లి మరియను శిశువునుజూచి సంతసించిరి సాగిలపడి బంగారు సాంబ్రాణి బోళములను వారర్పించిరి //ఇమ్మానుయేలు// Lyrics in English: Emmanuyelu jananam – Parishuddhatake sanketam Paramaatmuni prema swaroopam – Prajalandari rakshana maargam “Prabhuvu tejamu vellivirisenu – lokamanta Pandugaayenu deena janulaku – Anudinamantaa” 1. Prabhuvu neeku todaiyundagaa ponditi devuni krupalani Parishuddhaatmato garbhamu dharinchi aayana shakthini kammukoni Parishuddhunigaa puttina sishuve sarvonnatuniga nilachunani Pampabadina devadoota cheppenu – kanya mariyaku subhamani //Emmanuyelu// 2. Israayelanu prajalanu paripaalinche adhipati Belehemanu oori satramulo – Yudula raajuga Yesu puttenu Pottiguddalatho chutti Yesuni pashuvula tottilo parundabettiri Sayana janmaku aanavaaluga toorpuna otaara vudayinchenu //Emmaanuyelu// 3. Paapula rakshana paramaardhamugaa Yesu puttenani telusukoni Toorpudeshapu jnaanulaayananu poojimpagaa vachhitimani Intinijochhi talli Mariyanu sishuvunujoochi santasinchiri Saagilapadi bangaaru saabraani bolamulanu vaararpinchiri //Emaanuyelu// Go to top Credentials: Song – Emmanuelu Jananam Lyrics,Tune & Produced: JC Kuchipudi Music: JK Christopher Vocals & Video Edit: Lillian Watch this song on below YouTube link: Go to top Back to Lyrics E-H Lyrics Home Page Back to Home Go to top