లోకమంతట వెలుగు ప్రకాశించెను – యేసు జన్మించినపుడు = ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు – లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి //లోక//
1. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను – చీకటి దాని గ్రహింప లేదు = నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు- వాడు చీకటి లో నడువక జీవపువెలుగై యుండుడనె యేసు //లోక//
2. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను – చంద్రుడైన నక్కరలేదు = ఆ పట్టణములో దేవుని మహిమయే – ప్రకాశించుచున్నది యెపుడు – ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు //లోక//
3. మీరులోకమునకు వెలుగై యున్నారు గనుక – మీరు వెలుగు సంబంధులు = మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే – మరుగై యుండక నరులందరికి – వెలుగై యుందురనె యేసుండు //లోక//
4. చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును – చూచిరి ధన్యులై = లోకమందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద – ప్రకాశించెను గొప్ప వెలుగు ప్రభువు యేసుకు జేయని పాడరే //లోక//