కుమ్మరి ఓ కుమ్మరి! జగదుత్పత్తిదారీ! జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా…(2) 1. పనికిరాని పాత్రనని పారవేయకుమా పొంగి పోర్లు పాత్రగచేసి నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యెసున్ పొగడుచు౦డ సాక్షిగ నుండు పాత్రగ జేసి సత్యముతో నింపుము తండ్రి (2) # కుమ్మరి# 2. విలువ లేని పాత్రన్ నేను కొనువారులేరెవ్వరూ వెలలేని నీదు రక్తంబుతో వెలుగొ౦దు పాత్రగ జేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రన్ నేను సరిచేసి వాడుమయ్యా (2) # కుమ్మరి# ౩. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్ మనుష్యెచ్చలన్నియు స్తిరమనుచునే మనశ్శాంతి కోల్పోతీని పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నిను పట్టితిన్ ప్రాణ౦బు నాలో నున్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టితిన్ (2) # కుమ్మరి#