నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము – దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము 

1. అనుదినంబును ప్రభుని దలచుచు – అలయకను ప్రార్ధింతుము – అనవరతమా ప్రభుని చిత్తము – ననుకరింతుము పనులలో 

2. వేదవాక్య పఠనమందు – విసుగు – జెందక నుందుము = ఆదరంబున దైవ చిత్తము – ననుసరించుచు నడుతుము 

3. ఆశతోడను ప్రభుని దినమును – నాచరింతుము మరువక = విసుకు జెందక నాలయమునకు – పిన్న పెద్దల దెత్తుము 

4. సంఘ కార్యక్రమములందు – సహకరింతుము ప్రీతితో = భంగ పరచెడి పనులన్నిటి – కృంగదీసెదమనిశము

5. ప్రేమతోడను పొరుగువారిని – ప్రియులుగను భావింతుము = క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ – శాంతితో జీవింతము 

6. శక్తికొలది శరీరబలమును – శ్రమను క్రీస్తుకు నిత్తుము = భక్తితో హృదయమును పూర్తిగ – ప్రభునికే యర్పింతుము 

7. చిన్నవారలు దైవరాజ్యపు – చిరుత వారసులంచును = అన్నివేళల వారి వృద్ధికి – మిన్నగ దొడ్పడెదము

8. పెద్దవారలు దైవజనులని – పేర్మితో భావింతుము = శుద్దుడగు ప్రభు క్రీస్తు మనసును – శ్రద్ధతోడను జూపుచు 

9. జీవితంబున ప్రభును ప్రేమా – శీస్సులను ప్రసరింతుము = దివ్య జ్యోతుల రీతి వెలుగుచు – దివ్య సన్నిధి నుందుము