Song: Parama tandri ninnu memi

​పరమ తండ్రి నిన్ను మే మీ – పరస కాలము = స్వరములెత్తి ఇంపుగాను స్మరణ జెతుము //పరమ//

తండ్రి నిన్నునిన్ను స్మరణ జెతుము

1. నిరుపమాన దేవ నిన్ను – నిరత ప్రేమతో  = హరవుగా నూతి౦తుమేము హర్స రవముతో //తండ్రి//

2. అవని సంబ్రమములలొన – నవఘలించము = అవసరముగా నీదు పలుకు నవధారింతుము//తండ్రి//

3. వేయి నాళ్లు లొకమునను – వెలయుకంటెను = శ్రెయ మొక్క నాడు నిన్ను- సేవ జేయుట//తండ్రి//

4. ఉచితమైన నీ గృహమున – నచల భక్తితో = రుచిరమైన నీదుప్రేమ రుచినిజూతుము //తండ్రి//

5. మనసునందు సత్యబోధ – మనస్కరించుచు = మనెడు తరిని విడము  నీదు – ఉనికిపట్టును //తండ్రి//

6. గోరియ పిల్ల యొక్క ప్రేమ – గూర్చి భక్తితో = గొరత లేక చేతుమెపుడు – గోనబు గానము //తండ్రి//

7. శాంత జలమునొద్ద మమ్ము – శాంతి పరచుము = సంతసమును నీవు మమ్ము – సంతరించుము //తండ్రి//

8. దినములన్ని మేము నిన్ను – దీన మనసుతో- వనరు మాని సంతసమున వినతి జెతుము//తండ్రి//

రాగం: జంఝటి

తాళం: ఏక

సందర్భం :కృతజ్ఞతార్పణల పండుగ

రచన: యెషయా వీర మార్టిన్