రేయి పగలు నీపద సేవే – యేసు ప్రభువా  – చేయుట మేలు 

సాటిలేని దేవుడనీవే – నాదు కోట కొండయు నీవే 

 

1. పరమపురిలో వరదా నిరతం – దూత గణముల స్తుతులను సల్పి 

శుద్ధుడ పరిశుద్ధుడనుచు – పూజనొందే దేవుడ నీవే 

2. జిగటమన్నే మానవులంతా – పరమ కుమ్మరి ప్రభుడవు నీవే 

సృష్టికర్తను మరచి జనులు – సృష్టిని పూజించుట తగునా 

3. పెంట కుప్పలనుండి దీనుల – పైకి లేపు ప్రభుడవు నీవే 

గర్వమణచి గద్దెలు దింపి – ఘనులనైనా మేపవ గడ్డి 

4. నరుల నమ్ముట కంటే నిజముగ – నీదు శరణం శరణం దేవా 

రాజులను ధరనమ్ముటకంటే – రాజరాజువు నాకాశ్రయము 

5. అగ్నివాసననంటకుండా  – అబెద్నగోలతో నుండి నదేవా –

దానియేలును సింహపుబోనులో – ఆదుకొన్న నాధుడనీవే

6. పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు – పరము చేర్చు పదము నీవే 

అడుగుజాడల నడచిన – హానోకు – పరముచేరె ప్రాణముతోడ  

7. మృతుల సహితము లేపినావు – మృతిని గెల్చి లేచినావు 

మృతులనెల్ల లేపేవాడవు – మృత్యువును మృతి లేపినావు