You are precious
The word of God says you are precious.
Please read the below message and be encouraged in Christ.
ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు. దేవుని వాక్యము (1కోరిం:6:19-20) ఈలాగు సెలవిస్తుంది. మీరు మీ సోత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. సాధారణంగా మనము తరచుగా వినే మాట ”రక్షణ ఉచితం” లేదా ” ఉచితముగా పొందియున్నాము”, కానీ వాస్తవానికి పరిశీలిస్తే ఈలోకంలో మనము అనుభవించునదేది ఉచితముగా రాదు. అందుకే ఇంగ్లాండ్ దేశంలో తరచుగా వినే మాట “there is no free lunch”
రక్షణ మనయొద్దకు ఉచితముగా రాలేదు, ఆదియందు భూమికి పునాదులు వేసినపుడు తండ్రితో వున్న క్రీస్తే, సమస్తమును తండ్రితో కలసి నిర్మించిన ప్రభువే, తన సకల మహిమను విడచి, దైవత్వాన్ని వదలి, ఒక సామాన్య మానవుడిగా త్యాగము, ప్రేమ, సహనముల సమ్మిళితమై మానవునిగా ఈలోకంలో అవతరించి సల్పిన గొప్ప యాగము రక్షణ. ఆయున (క్రీస్తు) నీకొరకు నాకొరకు ప్రాణము పెట్టి ఇచ్చిన అద్భుత అవకాశం రక్షణ భాగ్యం. తండ్రియొద్దకు మార్గము చూపిన తాళపుచెవి రక్షణ. పాపములో వున్న మనలను తన రక్తము ఇచ్చి వేలుపెట్టి కొన్న (హెబ్రి:9:27-28) కరుణామృతము రక్షణ. ఇది ఒక అనుభవము మాత్రమే కాదు ఇది జీవితాంతము కొనసాగించవలసిన ప్రసహనం
రక్షణ అనునది అనుదినము భయముతోను వణుకుతోను కొనసాగించవలసిన ఒక విలువైన బహుమతి (ఫిలి:2:12) మనకు తెలియకపోయినప్పటికి అనేకమంది మనకొరకు తమ సమయము వెచ్చించి (ప్రార్ధనలో) తమ ధనము వ్యయపరచి (సంఘములో, కరపత్రికలద్వారా, రేడియో మరియు టీవిలద్వార) వాక్య పరిచర్య జరిగించుట వలన ఈనాడు మనము రక్షణ అనుభవము లోనికి నడిపించబడియుండవచ్చు.
నీ విలువైన జీవితాన్ని దేవుని కొరకు వెచ్చిస్తున్నావా లేక కాలమంతా నీ కొరకు నీ వారికొరకు మాత్రమే ఖర్చు పెడుతున్నావా? మా సంఘ కాపరి తరచుగా చెప్పే మాట “నీ/నా (అనగా రక్షింపబడిన వ్యక్తి) విలువ సాతానుకు బాగా తెలుసు” కాబట్టి సాతాను కుయుక్తులకు లోబడి జీవించక, కాలాన్ని క్రీస్తులో కొనసాగుటకు, అనేక మందిని ఆయనలోని నడిపించుటకు వెచ్చిద్దాం. క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఎదో ఒక తలాంతు దేవుడు ఇస్తాడు (మత్త:25:14-30) వాటిని దాచి పెట్టక మన కుటుంబములను, సంఘములను, సమాజాన్ని కట్టుటకు ఇంకా అనేక మందిని దేవునిలోనికి నడిపించుటకు ఉపయోగిద్దాం.
దానియేలు:12:3 లో దేవుని వాక్యం సెలవిస్తుంది “నీటి మార్గమును అనుసరించి నడుచుకొనునట్లు ఎవ్వరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశించుదురు”. అంతేకాదు మత్తయి:7:6 లో ప్రభువైన క్రీస్తు సెలవిచ్చిన మాట పవిత్రమైనది కుక్కలకు పెట్టవద్దు, ముత్యములను పందులయెదుట వేయవద్దు. నీ తలాంతులను నీకున్న శ్రేష్టమైన బహుమతులను, నీకు మాత్రమే ఇవ్వబడిన ఆ తలాంతును మనుష్యుల మెప్పుకోసం వాడవద్దు, అది ఈ లోకంలో నీకు గొప్పపేరు తెచ్చినా నిన్ను నిత్య రాజ్యములోనికి నడిపించలేదు. నీ తలాంతులను ఆయన సన్నిధిలో ఆయనను ఘనపరచుటకు అర్పించు, ఆయన నిన్ను నిత్యరాజ్య వారసునిగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి సదా తన రాకడ పర్యంతము అనుగ్రహించునుగాక
ఆమెన్
Telugu Christian Resource