Aha Mahatma ha sharnya song lyrics క్రీస్తు సిలువమీద పలికిన యేడు మాటలు ఆహా మహాత్మ హా శరణ్యా – హ విమోచకా = ద్రోహ రహిత చంపె నినునా దోషమేగదా! /యాహా/ 1. వీరలను క్షమించు తండ్రి – నేర రేమియున్ = కోరి తిటుల నిన్నుఁ జంపు -క్రూర జనులకై /యాహా/ 2. ”నీవు నాతో బరదైసున – నేడె యుందువు” = పావనుండ యిట్లు బలికి – పాపి గాచితి /వాహా/ 3. “అమ్మా! నీ సుతుఁడ” టంచు మరి -యమ్మాతో బలికి = క్రమ్మర “నీ జనని” యంచుఁ – గర్త నుడితివి /వాహా/ 4. “నా దేవ దేవ యేమి విడ – నాడితి” వనుచు = శ్రీదేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా /యాహా/ 5. “దప్పికొనుచున్నా న” టంచుఁ – జెప్పితివి గద = యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా! /యాహా/ 6. శ్రమ ప్రమాదములను గొప్ప – శబ్ధ మెత్తి హా = “సమాప్తమైన” దంచు దెలిపి – సమసితివి గదా /యాహా/ 7. “అప్పగింతు దండ్రి నీకు – నాత్మ” నంచును = గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా /యాహా/ Credentials: రచన: పంతగాని పరదేశి సందర్భం: క్రీస్తు శ్రమలు మరణము రాగం: హిందుస్తానీ కాపీ తాళం: రూపకము Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top