Aha Yentati sramala bonditivo song lyrics ఆహా ఎంతటి శ్రమల బొందితి – వయ్యో – దాహ మాయెను నీకు సిల్వపై = ద్రోహులందరు గూడి రయ్యయ్యో – నీదు – దేహంబు బాధించి రయ్యయ్యో //యాహా// 1. దుష్కర్ములకు నప్పగించెనా – యూద – యిస్కరి యాతనెడి శిష్యుడు = తస్కరించినవాని భంగిన నిన్ను – నిష్కారణముగాను బట్టిరా //యాహా// 2. కలుషాత్ములందరు గూడిరా – నిన్ను – బలువిధంబుల హింసబెట్టిరా = తలపై ముళ్ల కిరీటముంచి యా – సిలువ నీతోనే మోయించిరా //యాహా// 3. కాలుసేతులయందు వారలు – ఇనుప – చీలల దిగగొట్టిరయ్యయ్యో = జాలి – సుమంతైన జూపక – వారు – గెలిజేయుచు బాధపెట్టిరా //యాహా// 4. బాధ తగ్గింపరాణువవారలు – నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా = నీదు మనస్సు దానినొల్లక గొప్ప – వేదనలను భరియించెనే //యాహా// రచన: కొత్తపల్లి జాన్ రాగం : హిందుస్తానీ తోడి తాళం: త్రిపుట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు: 190 వ పాట Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top