Akashame pattanodu song Lyrics
Lyrics in TeluguLyrics in English
సా.కీ.
అవనిలో ఉద్భవించే ఆదిసంభూతినిచూడరే
పుడమియే పరవసించే పసిబాలుని చూడగనే పసిబాలుని చూడగనే
ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు //2//
Bridge :
ఆనందమే మహా ఆనందమే-అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే-యేసు జననం అద్భుతమే //2//
1.అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాధుడు //2//
ఆదియందు వాక్యంబుగా సృష్టి కార్యము జరిగించినాడు
ఆనాది నుడి జ్ణానంబుగా సృష్టి క్రమము నడిపించినాడు//2//
అన్నిటిని కలిగించిన మహరాజు కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు //2//ఆనందమే//
ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు //2//
2.పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు //2//
నిత్యముండు నీతి సూర్యుడు-సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు-పశుల పాకలో పవళించినాడు //2//
సర్వాధికారి ఐన మహరాజు -దీనులకు దీవెనగా దిగివచ్చినాడు //2//ఆనందమే//
Lyrics in English