పరిశుద్ధ గ్రంధములో దావీదు మహారాజు పేరు రాయబడినన్ని సార్లు వేరెవరి పేరు వ్రాయబడలేదు. దానికి కారణం ఆయన హృదయ పూర్వక ఆరాధన మరియు ఆయన దేవునితో కలిగిన దాపరికాలు లేని సంబంధం. ఆయన దేవుని ఎంతగా ఆశించాడనేది ఆయన మాటల్లోనే తెలుస్తుంది (కీర్తన: 42:1) ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం
2 సముయేలు:6:12-15 ఇది దేవుని మందసం ఒబెదేదోము ఇంటినుంచి దావీదు పురమునకు తీసుకువెళ్ళే సమయమ్. 12 దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను. 13 ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను, 14 దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను. 15 ఈలాగున దావీదును ఇశ్రాయేలీయు లందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.
ఈ వాక్యాని నిశితంగా గమనిస్తే ఒబెదేదోము ఇంటినుంచి దావీదు పురమునకు మధ్య దూరం 6 మైళ్ళు. ఈ దూరాన్ని చేరడానికి దావీదుకు పట్టిన సమయం సుమారు 78 రోజులు! ఎందుకని? దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ప్రతి ఆరు అడుగులకు ఒక ఎద్దు ఒక క్రొవ్విన దూడ వధింపబడెను, అనగా ఆరు అడుగులు సాగి ఒకసారి ఆగి బలిపీఠమ్ సిద్ధపరచి బలి అర్పించి మరలా బయలుదేరేవారు 6 మైళ్ళకు మొత్తం 2437 సార్లు ఆగారు, అనగా ప్రతి మైలుకు 406 సార్లు ఆగారు. 2437 ఎద్దులు 2437 క్రొవ్విన దూడలు బలిగా అర్పించారు అదే సమయంలో దేవుని అరాధించుచు వచ్హారు. బలిని సిద్హపరచి అర్పించిన సమయం 30 నిముషాలు అనుకుంటే మొత్తం ప్రయాణం 1259 గంటలు, అనగా 52 రోజులు. మధ్యలో రోజుకు 8 గంటల నిద్ర 3 గంటల భోజన విరామంగా తీసుకుంటే ఆ మొత్తం 630 గంటలు అనగా 26 రోజులు ! దీనిని బట్టి చుస్తే ఆయన ఆ అరుమైళ్ళు చేరడానికి షుమారుగా 78 రోజులు పట్టి వుండాలి.
ఒక రాజుగా దావీదుకు అంతకన్నా ప్రాముఖ్యమైన పనులు లేవా? చేయవలసిన కార్యాలు, యుద్ద్హాలు చాల వున్నాయి, కాని వాటిని జయించడానికి అతనికున్న ఆయుధం ఒక్కటే! అది ఆరాధన ఆరాధన ఒక దినచర్య, దేవునితో గడిపే శ్రేష్టమైన సమయం. దేవునిచే మన జీవితంలో కొలవబడే అతి విలువైన సమయం. ప్రియ సహోదరుడా సహోదరి ఒక రాజు ఈవిధంగా దేవుని ఆరాధిస్తే, మనం ఎంతగా ఆయనను ఆరాధించాలి. ఆదివారం గుడిలో చేసే ఆరాధన మాత్రమె గాక ఆయనకు చెందవలసిన సమయం ఆయనకు అర్పిద్దాం. సాతాను కోల్పోయిన ఆ మహైమొన్నతుని సన్నిధిని చేరడానికి ఉన్న ఒకే సాధనం ఆయనను అరాదించడమే. అందుకే దావీదు దేవుని హ్రుదయానుసారుడు అయ్యాడు. ఆయన వంశంలోనుంచి రావడానికి, దావీదు చిగురుగా పిలువబడటానికి ఇష్టపడ్డాడు. మీ అనుదిన దేవుని సహవాసం మరింతగా పెరగాలని ఆశిస్తూ