AKAASA VEEDHULLO ANANDAM
Lyrics in TeluguLyrics in English
పాపాన్ని పోగొట్టి – శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా!
మానవుణ్ణి విడిపించి – పరలోకం ఇచ్చుటకు సిలువను మోసావయ్యా! //2//
కన్నీరే తుడిచావయ్యా – సంతోషం ఇచ్చావయ్యా
మనుషులను చేశావయ్యా – నీ రూపాన్ని ఇచ్చావయ్యా
నా సర్వం యే..సయ్య.. – నా జీవం యే..సయ్య
నా ప్రాణం యే..సయ్య – నా ధ్యానం యే..సయ్య //2//
2. బంగారం కోరలేదు – వెండియు కోరలేదు హృదయాన్ని కోరావయ్య!
ఆస్తియు అడగలేదు – అంతస్తు అడగలేదు హృదయాన్ని అడిగావయ్య! //2//
నే వెదకి రాలేనని – నా కోసం వచ్చావయ్యా //2//నా సర్వం//
3. తల్లి నిన్ను మరచిన – తండ్రి నిన్ను మరచిన యేసయ్య మరువడయ్య!
బంధువులు విడచిన – స్నేహితులు విడిచిన యేసయ్య విడువడయ్య! //2//
చెయ్యి పట్టి నడుపూనయ్య – శిఖరముపై నిలుపునయ్య //2//నా సర్వం//