బేధం ఏమి లేదు! – అందరును పాపం చేసియున్నారు,
దేవాదిదేవుడు ఇచ్చే ఉన్నత మహిమను – పోగొట్టుకున్నారు /2/
ఏ కులమైన మతమైన జాతైన రంగైన – దేవుని దృష్టిలో అందరు పాపులే /2/బేధం/
1. ఆస్తి పాస్తులు ఎన్నున్నా – నిత్యరాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా – సంతోషాన్ని నీకివ్వవు
సమసిపోయే ఈలోకము – ఆశ్రయాన్ని నీకివ్వదు
తరిగిపోయే ఈ కాలము – కలవరాన్ని తీర్చదు
నీవేవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసులేకుంటే నీకున్నవన్ని సున్న /2/బేధం/
2. పుణ్యకార్యాలు చేసినా – పవిత్రత నీకు రాదుగా
తీర్ధ యాత్రలు తిరిగినా – తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు – రక్తము కార్చెను సిలువలో
కోరికోరి నిను పిలిచెను – పరమ రాజ్యము నీకివ్వగ
నీ స్థితి ఏదైనా – గతి ఏదైనా వృత్తేదైనా భ్రుతి ఏదైనా
కలువరి నాధుడే రక్షణ మార్గము /2/బేధం/
Credentials: Written and Sung by Dr. John Wesley
Music: Bro.Jona