చిరకాల స్నేహితుడా – నా హృదయాన సన్నిహితుడా 

నాతోడు  నీవయ్యా -నీ స్నేహం చాలయ్యా  

నానీడ  నీవయ్యా –  ప్రియ ప్రభువా యేసయ్యా 

 

“చిరకాల స్నేహం  – ఇది నా యేసు స్నేహం” 

1.  బంధువులు వెలివేసిన  – వేలివేయని స్నేహం 

లోకాన  లేనట్టి  ఓదివ్య  స్నేహం – నా యేసు  నీ స్నేహం      //చిరకాల//

 

2.   కష్టాలలో  కన్నీళ్ళలో  – నను  మోయు నీ స్నేహం 

నను ధైర్యపరచి ఆదరణ కలిగించు  – నా యేసు నీ స్నేహం    //చిరకాల//