Chudumu gethsemane song lyrics in Telugu and English

Lyrics in TeluguLyrics in English

చూడుము గెత్సేమనే – తోటలో నా ప్రభువు

పాపి నాకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది

పాపి నీకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది

1. దేహమంతయు నలగి – శోకము చెందినవాడై

దేవాది దేవుని – ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే

2. తండ్రి ఈ పాత్ర తొలగున్ – నీ చిత్తమైన యెడల

ఎట్లయినను నీ – చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను

3. రక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొంది

రక్షకుడేసు – హృదయము పగలగ – విజ్ఞాపనము చేసెనే

4. ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే – మన యేసు

ప్రభువు – తానే వేడుకొనెను – పాపుల విమోచన కొరకే

5. ప్రేమామృత వాక్కులచే – ఆదరించెడి ప్రభువు – వేదన

సమయమున – బాధపరచెడి వారి కొరకు ప్రార్ధన చేసెనే

6. నన్ను తనవలె మార్చెడి – ఈ మహా ప్రేమను త-ల-చి

తలచి హృదయము కరుగగ – సదా కీర్తించెదను /చూడుము/

Credentials : 
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు (అనుబంధము) – 650 వ పాట

Lyrics in English :

Chudumu gethsemane – Totalo naa prabhuvu

Paapi naakai vijnaapana chesedi – Dwhanivinabaduchunnadi

Paapi neekai vijnaapana chesedi – Dwhanivinabaduchunnadi

1. Dehamantayu nalagi – Shokamu chendinavaadai

Devaadhi devuni – Yekaika sutudu padu vedanalu naa korake

2. Tandri ee paatra tolagun – Nee chittamaina yedala

Yetlainanu nee chittamu cheyutaku nannappaginchitivanenu

3. Rakthapu chemata valana – Mikkili baadhanondi

rakshakudesu – hrudayamu pagalaga – vijnaapanamu chesene

4. Mummaaru bhoomimedapadi mikkili vedanache – Mana Yesu

Prabhuvu – Taane vedukonenu – paapula vimochana korake

5. Premaamruta vaakkulache – aadarinchedi prabhuvu – vedana

samayamuna – baadhaparachedi vaari koraku praardhana chesene

6. Nannu tanavale marchedi – ee maha premanu talachi

talachi hrudayamu karugaga – sadaa keertinchedanu / Chudumu/

Credentials:
Andhra Kraistava Keerthanalu (additional) – Song 650

Listen to this song on below YouTube link: