దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము /2/

ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ 

నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా /దేవా/ 

 

1. కాపరి మా యెసు ప్రభువే – కొదువేమి లేదు మాకు

మాకేమి భయము? మాకేమి దిగులు? – నీకే వందనము లయ్యా…  

లొబడి జీవింతుము – లొపంబులు సవరించుము 

లోకాశలు వీడి – లోకంబులోన – నీ మందగా వుందుము  //దేవా // 

 

2. సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము 

నెమ్మదిగల ఇల్లు – నిమ్మళమగు మనస్సు – ఇమ్మహిలో మాకిమ్మయ్యా.. 

ఇమ్ముగ దయచేయుము – గిన్నే నిండిన అనుభవము 

ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగ – మమ్ములను బలపరచుము //దేవా // 

 

3. యేకీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను 

లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండ – దాచుము నీ చేతులలో 

ఒలీవ మొక్కలవలెను – ద్రాక్షా తీగెలను పోలి 

ఫలసంపదలతోను కలకాలము జీవించ – కురిపించుము నీ దీవెనలన్  //దేవా // 

 

4. పెంపారజేయుము మాలో – సోంపుగా నీ ఘన ప్రేమన్ 

నింపుమా హృదయముల – శాంతి భాగ్యంబులతో సంతసంబుగ సాగెదము 

వింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుము 

కొంతకాలమే మేము ఉందుము లోకాన – చెంత చేరగ కోరెదము //దేవా //