దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము 

మహా వినోదు డాపదల సహాయుడై నన్ బ్రోచును 

అభయ మభయ మభయ మెప్పుడానంద 

మానంద మానంద మౌగ  #దేవుడే#

 

1. పర్వతములు కదలిన నీ యుర్వి మారు పడినను 

సర్వమున్ ఘోషించుచు నీ సంద్రముప్పొంగినన్ #అభయ#

 

2. దేవుడెపుడు తోడుగాక దేశము వర్ధిల్లును 

ఆ తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు 

 

3. రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన

పుజ్యుడౌ యెహోవ వైరి బూని సంహరించును 

 

4. విల్లు విరచునాయనే తెగ బల్లెము నరకు నాయన 

చెల్లచెదరు చేసి రివుల నెల్ల ద్రుంచు నాయనే 

 

5. పిశాచి పూర్ణ బలము నాతో బెనుగులాడ జడియును 

నశించు శత్రు గణము దెవునాజ్ఞ వలన మడియును 

 

6. కోటయు ఆశ్రయమునై యాకోబు దేవుడుండగ 

వేటికింక వేరవవలయు నెపుడు నాకు బండుగ