దేవుడు మా పక్షమున వుండగా మాకు విరోధి యెవడు /2/

జీవము గల దేవుని సైన్యముగా – సాతాన్ను వోడింతుము /2/

యుద్ధం యెహొవాదె – రక్షణ యెహొవాదె- విజయం యెహొవాదె – ఘనతా యెహొవాదె/2/దేవుడు/ 

 

1. మాదేవుని బాహువే – తన దక్షిణ హస్తమే – ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును /2/

తనదగు ప్రజగా మము రూపించి – నిరతము మాపై కృప చూపించి 

తన మహిమకై మము పంపించి – ప్రభావమును కనుపరచును /యుద్ధం /

 

2. మాదేవుని యెరిగిన – జనులముగ మేమందరం 

బలముతొ ఘన కార్యముల్ – చేసి చూపింతుము 

దేవుడు చేసిన క్రియలను చేసి – భూమిని తలక్రిందులుగా చేసి 

ఆయన నామము పైకెత్తి – జయ ధ్వజము పైకెత్తెదమ్ /యుద్ధం/