దేవునికి స్తోత్రము గానము – చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము – చేయుటయే మంచిది 1. యెరుషలేము యెహోవాయే – కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని 2. గుండె చెదరిన వారిని – బాగుచేయువాడని వారి గాయములన్నియు – కట్టుచున్నవాడని 3. నక్షత్రముల సంఖ్యను – ఆయనే నియమించును వాటికన్నియు పేరులు – పెట్టుచున్నవాడని 4. ప్రభువు గొప్పవాడును – అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే – మితియు లేనివాడని 5. దీనులకు అండాయనే – భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని – స్తుతులతో కీర్తించుడి 6. ఆయన ఆకాశమున్ – మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము – సిద్ధపర్చువాడని 7. పర్వతములలో గడ్డిని – పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును – ఆహారము తానీయును 8. గుర్రముల నరులందలి – బలము నానందించడు కృప వేడు వారిలో – సంతసించు వాడని 9. యెరుషలేము యెహోవాను – సియోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము – ఆనందించువాడని 10. పిల్లల నాశీర్వదించియు – బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమ పంటతో – నిన్ను తృప్తిగనుంచును 11. భూమికి తన యాజ్ఞను – ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని – వాక్యము పరుగెత్తును 12. వాక్యమును యాకోబుకు -తెలియజేసినవాడని ఏ జనము కీలాగున – చేసి యుండ లేదని