A                  D                 A           E

ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యూటగు

A                  D                     A       E A

ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును

A                     E              D     A     E

యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగా

A                D            A          E   A

శ్రీ యేసు రక్తమెప్పుడు – స్రవించు నాకుగా   (2)

  1. ఆయూటమున్గిదొంగయు – హ! శుద్దుడాయెను

నేనట్టి పాపి నిప్పుడు – నేనందు మున్గుదున్ #యేసుండు#

  1. నీయొక్కపాపమట్టిదే – నిర్మూలమౌటకు

రక్షించు గొర్రెపిల్ల నీ – రక్తంబే చాలును #యేసుండు#

  1. నానాధురక్తమందున – నేనమ్మియుండినన్

నా దేవుని నిండు ప్రేమ – నే నిందు జుచెదన్ #యేసుండు#

  1. నాయాయుష్కాలమంతట – నాసంతసంబదే

నా క్రీస్తు యొక్క రోమ్మునన్ – నా గాన మిదియే #యేసుండు#