Enaleni Prema naa paina Song Lyrics ఎనలేని ప్రేమ నా పైన చూపి – నీ వారసునిగ చేసినావు //2// నీ ప్రేమ నేను చాటెదన్ – నా సర్వం నీవే యేసయ్యా //2//ఎనలేని// 1. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో నను నడిపిన ప్రభువా/2/ నీ కృప చేత రక్షించినావే నీ ఋణము నే తీర్చగలనా//2//ఎనలేని// 2. తండ్రి లేని నాకు పరమ తండ్రి నీవై వొంటరి నైయున్న నాతో నేనున్నానని అన్నావు కన్నీరు తుడిచి నన్నాదరించిన ఆ జాలి నే మరువగలనా//2//ఎనలేని//