గురియొద్దకే పరుగిడుచుంటిని – క్రీస్తుని పిలుపుతో
బహుమానముల్ పొందు రీతిని – ఆలయక వెనుతిరుగక
యేసులో కొనసాగెదన్ – యేసుతొ కొనసాగెదన్(2)
కొండలైనా లోయలైన – యేసుతొ కొనసాగెదన్(2)
1. నాగటి పైన చేయి నిలిపి – వెనుక చూడక కొనసాగెదన్
కన్నీరు కార్చి దేవుని వాక్యం – మనుష్య హృదయములో నాటెదన్(2)
ఎన్నడూ దున్నబడని – భూమిని నేదున్నెదన్
కొండలైనా లోయలైన – యేసుతొ కొనసాగెదన్(2)
2. శిలువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరు వాడల నే చాటెదన్
శిరమును వంచి కరములు జోడించి – ప్రార్ధానాత్మతో నే వేడెదన్(2)
శిలువ ప్రేమ నాలో – ప్రజలకు చూపించేదన్
కొండలైనా లోయలైన – యేసుతొ కొనసాగెదన్(2)