Halleluya ani paadi stutimpanu song lyrics
Lyrics in TeluguLyrics in English
హల్లెలూయ యని పాడి స్తుతింపను
రారె జనులారా మనసారా ఊరూర
రారే జనులార నొరార ఊరూర
1. పాడి పంటలనిచ్చి – పాలించు దేవుడని //2//
కూడు గుడ్డల నిచ్చి పోషించు దేవుడని //2//
తోడు నీడగ నిన్ను – కాపాడు నాధుడని //2//
పూజించి.. పూజించి – పాటించి – చాటించ రారె //హల్లే//
2. తాత ముత్తాతలకన్న – ముందున్న దేవుడని //2//
తల్లి దండ్రులకన్న ప్రేమించు దేవుడని //2//
కల్లాకపటములేని – కరుణ సంపన్నుడని //2//
పూజించి.. పూజించి – పాటించి – చాటించ రారె //హల్లే//
3. బందూ మిత్రులకన్నా – బలమైన దేవుడని //2//
అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని //2//
కన్నబిడ్డలకన్న – కన్నుల పండుగని //2//
పూజించి.. పూజించి – పాటించి – చాటించ రారె //హల్లే///
4. రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని //2//
నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని //2//
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని //2//
పూజించి.. పూజించి – పాటించి – చాటించ రారె //హల్లే//