Hey Prabhu yesu Telugu Song Lyrics
హే ప్రభుయేసు హే ప్రభుయేసు – హే ప్రభుయేసు దేవ సుతా
సిల్వధరా- పాపహర- శాంతికరా
-
శాంతి సమాధానాధిపతి- స్వాంతములో ప్రశాంత నిధి (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)- శాంతి సువార్త నిధి #హే#
-
తపములు తరచిన నిన్నే గదా – జపములు గొలచిన నిన్నేగదా(2)
విఫలులు చేసిన విజ్ఞా పనలకు(2)- సఫలత నీవె కదా#హే#
-
మతములు వెదకిన నిన్నెకద – వ్రతములు గోరిన నిన్నే గదా(2)
పతితులు దేవుని సుతులని నేర్పిన(2)- హితమత నీవె గదా#హే#
-
పలుకులలో నీ శాంతి కధ – తొలకరి వానగ గురిసెగద(2)