హృదయమనెడు తలుపునొద్ద – యేసు నాధుండు 

నిలిచి సదయుడగుచు – తట్టుచుండు సకల విధములను 

 

1. పరునిబోలి నిలచున్నాడు – పరికించి చూడ 

నతడు – పరుడు గాడు – రక్షకుండు – ప్రాణ స్నేహితుడు 

 

2. కరుణ సీలుండతడు గాన – గాచియున్నాడు 

యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు 

 

3. ఎంతసేపు నిలువబెట్టి – ఏడ్పింతురతని

నాత -డెంతొ దయచే బిలచు చున్నాడిప్పుడు మిమ్ములను 

 

4. చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసు నాధు – నతడు 

చేర్చుకొనుచు మీకిచ్చును – చిరజీవము గృపను