ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం 

ఇది లోక కల్యాణం – మేరి పుణ్య దినం 

 

1. రాజులనేలే రారాజు – వెలసెను పశువుల పాకలో 

పాపుల పాలిట రక్షకుడు – నవ్వెను తల్లి కౌగిలిలో 

భయములేదు మనకిలలో – జయము జయము జయమహో /2/

2. గొల్లలు జ్ఞానులు ఆనాడు – ప్రణమిల్లిరి భయభక్తితో 

పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో 

జయ నినాదమే భువిలో – ప్రతిద్వ్హనించెను ఆ దివిలో /2/