Song: Jayaminka manadera jaya dwhanine cheseyra lyrics – Bro Anil Kumar Song
జయమింక మనదేరా – జయధ్వనినే చేసేయరా – ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా /జయ/
జయమింక మనదేరా – జయధ్వనినే చేసేయరా – బలపరిచే క్రీస్తునిలో అన్నిటిని చేసేయరా
Bridge:
(జయించువారికె జీవకిరీటమ్ – జయించువారిదే రాజ్యాధికారమ్
జయించువారికై వున్నదిరా సింహాసనమ్ ….
Overcomes – we are overcomes
Overcomes – we are more than conquerers)
-
పాపపు అజమాయిషీ ఇక లేదురా మనమీదన
యేసుని రక్తమే తొలగించె పాపమలిన
హే మరణమా ముల్లెక్కడ బలమెక్కడ జయమెక్కడ ?
చావునే చంపేసెనే ప్రభు రక్త బలియర్పణ
పాపాన్ని తీసి నీతినిచ్చెను దేవుడు ఎప్పుడో
మరణాన్ని దాటి పొందినాము జీవము ప్రభునిలో
ఇక పాపం మరణం అన్నిటిపైనానీదే జయవిజయం (Bridge)
-
మరణపు బలము కలిగిన అపవాది తల ప్రభువు త్రొక్కెనే!
ప్రధానులన్ అధికారులన్ నిరాయుధుల చేసెనే
హే చీకటి అధికారము నుండి తండ్రి మనల విడిపించెనే
యేసుని రాజ్యపు నివాసులుగా చేసెనే
ఆ శత్రు బలమంతటిపై మనకధికారము ఇచ్చెనే
మన కాళ్ళ క్రింద దుష్టుని ప్రభు చితక త్రొక్కించెనే
ఇక సర్పమ్ సింహమ్ భుజంగములను త్రొక్కేయ్ నీదేజయమ్ (Bridge)
-
దేవుని ధర్మశాస్త్రమున్ ప్రభు యేసుడే నెరవేర్చెనే
మనలను ప్రతి శాపమునుండి ప్రభు విమోచించెనే
హే కృపలతో తన కృపలతో ప్రభువు మనల బ్రతికించెనే
పాతాళపు ద్వారాలిక మనముందు నిలువవలెనే
శరీర క్రియలను సిలువేయుటకు ఆత్మనే ఇచ్చెనే
లోకాశాలన్నిటి జయించుటకు తన బీజమే వుంచేనే
ఇకలోకం దేహం అన్నిటిపైనా నీదే జయవిజయమ్ (Bridge)
Lyrics in English:
Jayaminka manadera – jaya dwhanine cheseyra
Preminche yesunilo – atyadhikapu jayamera
Jayaminka manadera – jaya dwhanine cheseyra
Balapariche kreesthunilo – Atyadhikapu jayamera
Bridge: (Jayinchuvaarike jeevakereetam – Jayinchuvaaride raajyadhikaaram
Jayinchuvaarike vunnadiraa simhaasanam
Overcomes – we are overcomes
Overcomes – we are more than conquerers)
-
paapapu ajamaayishi ika ledura mana meedana
yesuni rakthame tolaginche paapa malina
He maranama mullekkada balamekkada Jayamekkada?
Chaavune champesene prabhu raktha baliyarpana
Paapaanni teesi neeti nichhenu devudu yeppudo
Maranaanni daati pondinaamu jeevamu prabhunilo
Ika paapam maranam annitipaina neede jayavijayam (Bridge)
-
Maranapu balamu kaligina apavaadi tala prabhuvu trokkene
pradhaanulan adhikaarulan niraayudhula chesene
He cheekati adhikaaramu nundi tandri manala vidipinchene
Yesuni raajyapu nivaasuluga chesene
Aa satru balamantatipai manakadhikaaramu ichhene
Mana kaalla krinda dushtuni prabhu chitaka trokkinchene
Ika sarpam simham bhujangamulanu trokkey neede jayam (Bridge)
-
Devuni dharma saastramun prabhu Yesude neraverchene