||పల్లవి|| జీవిత యాత్రలో -నాదు గురి నీవేగా
నీకు సాటి ఎవ్వరు యేసువా
నీవు నడిచావు కెరటాలపై
నన్ను నడిపించుమో యేసువా
1. నన్ను నడిపించు చుక్కాని -నీవే కదా ( నీవే కదా )
నన్ను కాపాడు దుర్గంబు – నీవే కదా ( నీవే కదా )
నీదు వాక్యంబు సత్యంబెగా -నాకు నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబెగా -నన్ను నడిపించుమోయేసువా ||జీవిత||
2. నాకు నిరతంబు మదిలోన -నీ ధ్యానమే ( నీ ధ్యానమే )
నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే ( నీ గానమే )
నాకు నీవేగా సర్వస్వమూ-నీదు నామంబే ఆధారము
నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతియింతునో యేసువా||జీవిత ||