జీవితమంత నీ ప్రేమ గానం  – ప్రణుతింతుమో యేసుదేవా 

ప్రచురింతు మేము నీకీర్తిన్ – ఆనంద గానంబుతో 

 

1. సర్వ సమయములలో – నీ స్తుతిగానం 

ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం 

మాకదియే మేలు – ఈ జీవితమున 

స్తుతియింతు నా రక్షకా 

 

2. సృష్టి నంతటిని నీ మాట చేత 

స్తుజియించితివిగా మా దేవ దేవా 

నీ ఘనమగు మహిమన్ – వర్ణింప తరమా 

స్తుతియింతు నా రక్షకా 

 

3. కలుషాత్ములమైన మా కొరకు నీ 

విలువైన ప్రాణంబు నర్పించితివిగా 

కలువరిగిరిపై చూపిన ప్రేమన్ 

స్తుతియింతు నా రక్షకా