జీవితంలో నీలా వుండాలని – యేసు నాలో ఎంతో ఆశున్నది #2#

తీరునా నా కోరిక – చేరితి ప్రభు పాదాల చెంత #జీవి#

 

1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో – ఉపవాసములో ఉపదేశములో #2#

నీలాగె చేయాలని – నీతోనె నడవాలని 

నీలాగే చేసి నీతోనె నడచి నీదరికి చేరాలని #2#తీరునా#

 

2. కూర్చుండుటలో నిలచుండుటలో – మాట్లాడుటలో ప్రేమించుటలో #2#

నీలాగె బ్రతకాలని – నీచిత్తం నెరవేర్చని  

నీలాగే బ్రతికి నీచిత్తం నెరవేర్చి – నీదరికి చేరాలని #2#తీరునా#