Kaanapurambulo Telugu marriage song lyrics

కానాపురంబులో గడు వింతగా నీరు – జానుగా ద్రాక్షారసమును జేసి =

పానముగఁబెండ్లిలో – బాగుగా నిచ్చిన – దీన రక్షక బెండ్లి – దీవించుమీ /కానా/

  1. రావయ్య పెండ్లికి – రాయముగా నో యేసు – ఈవు లియ్యగ వచ్చు – హితునిబోలి = కావు మీద్వంద్వయమును – ఘనమైన కృపచేత – భావమాలిన్యంబుఁ – బాపి యిపుడు /కానా/

  2. దయ నుంచు మయ్య యీ – దంపతులమీద స -దయుండవై కాపాడు – తండ్రి వలెను = నియమంబుగా వీరు -నీ చిత్తమును జరిపి – భయము లేకుండ గ – బ్రతుక నిమ్ము /కానా/

  3. ఒప్పు మీరగ జేయు – నొప్పందము వీర – లెప్పుడును మదిలోన – నిడికొనుచును = దప్పకుండగ దాని – నిప్పుడమిలో నెపుడు – గొప్పగా నెరవేర్ప – గూడ నుండు

  4. చక్కగా నెగడింప – సంసార భారంబు – నెక్కువగు నీ యాత్మ – నిపుడొసంగి = నిక్కమగు సరణిలో – నెక్కువగ నడిపించి – క్రక్కునను దీవించు – కరుణానిధీ

  5. పిల్లలను నీవొసఁగఁ – బ్రియముతో నో దేవ – పెల్లుగా బోధింప – వెరవు జూపు = మెల్ల వేళలలోన – నిరుకు మార్గము నందు – జల్లగా నడిపింప – శక్తి నిమ్ము

Credentials: 
Lyrics: Pulipaaka Jagannadham
Raagam: aananda Bhairavi
Taalam: Kurujhumpe
From Andhra Kraistava Keertanalu : Song :562