kalyaana Veduka Telugu marriage song lyrics

కళ్యాణ వేడుక – రమణీయ గీతిక 

శుభప్రద ఆశాదీపిక – సుమధుర స్వరమాలిక 

క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక 

నూతన జీవిత ప్రారంభ వేదిక 

  1. వివాహ వ్యవస్థను చేసిన దేవుడు

మొదటి వివాహము జరిగించినాడు 

సంఘ వదువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు 

ఈనాటి పెళ్ళికి కారణభూతుడు 

కడపటి పెళ్ళికి ఆయనే వరుడు 

  1. ఒకరికి ఒకరు సహకారులుగా

సంతోషముతో ఇల జీవించగా 

సంతానముతో దీవించబడగా 

సహవాసములో సంతృప్తి చెందగా 

పరిశుద్ధుడే కలిపె ఇరువురిని ఒకటిగా 

  1. కిలకిల రవళుల వీణెలు మ్రోగెను

ఆనంద లహరుల సందడి సాగెను 

పరలోక దూతల సంతోష గానాలు 

బంధుమిత్రుల అభినందన మాలలు 

ఆ జంట కనులలో వెలిగే కాంతులు 

Credentials: 

Singer: Nitya 

Album: Kalyana Veduka

Lyrics and Music: Dr. A.R. Stevenson