పల్లవి: కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు

మనకై సిలువపై మేకులతో కొట్టబడెను (2X)

 

1. ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను

ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను(2X)

ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు (2X) /కనుమా/

 

2. బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను

కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను (2X)  

అలసి, సొలసి, నిస్సాహాయుడై తాను నిలిచెను (2X) /కనుమా/