Koniyaada tarame ninu Telugu Christian song lyrics కొనియాడఁ దరమె నిన్ను – కోమల హృదయ – కొనియాడఁ దరమె నిన్ను = తనరారు దినకరు – బెనుతారలను మించు – ఘనతేజమున నొప్పు – కాంతిమంతుఁడ వీవు /కొని/ 1. ఖేరుబులు సెరుపులు – మరి దూత గణములు = నూరుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు /కొని/ 2. సర్వలోకంబులఁ – బర్వు దేవుడ వయ్యు = నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు /కొని/ 3. విశ్వమంతయు నేలు వీరాసనుడ వయ్యు = పశ్వాళితోఁ దొట్టి – పండియుంటివి నీవు /కొని/ 4. దోసంబులను మడియు – దాసాళి గరుణించి = యేసుపేరున జగతి కేగుదెంచితినీవు /కొని/ 5. నరులయందున గరుణ – ధర సమాధానంబు = చిరకాలమును మహిమ పరగ జేయుదు వీవు /కొని/ 6. ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేగొని = శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత /కొని/ Credentials: Lyrics by : Vantagaani Paradesi Raagam: Kamaasu Taalam: Triputa (3/4) Collected from Andhra Kraistava Keerthanalu song number 108