Koniyaadabadunu Yehova yandu Telugu Marriage song Lyrics కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తనవారికైన పగవారికైన పంచును సమత మమత 1.ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు కలిగిన భార్య ఇంటికి దీపము సంఘమనే ఆ వధువునకు నిజమైన రూపము 2.తండ్రివలె ఓదార్చి తల్లివలె సేదదీర్చి మిత్రునివలె భర్తకు ఎప్పుడు తోడుగ నిల్చును దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును 3.బ్రతుకు దినములన్నియును భర్తకు మేలే చేయును దీనులకు దరిద్రులకు తన చేయిచాపును ఆహారమును తానే సిద్ధపరచును ఇంటివారినందరిని కనిపెట్టుచుండును Lyrics in English Koniyaadabadunu Yehova yandu – bhaya bhaktulu gala vanitha Tanavaarikaina pagavaarikaina panchunu samata mamata 1.Prati paristitini premato bharinchagaligina orpu Pratikoolatanu anukulamugaa maarcheti nerpu Kaligina bhaarya intiki deepamu Sanghamane aa vadhuvunaku nijamaina roopamu 2.Tandrivale odaarchi tallivale seda deerchi Mitrunivale bharthaku yeppudu toduga nilchunu Daiva jnaanamutho kutumbamunu nadupunu Raabovu vaati goorchi nishntaga nundunu 3.Bratuku dinamulanniyunu Bhataku mele cheyunu Deenulaku daridrulaku tana cheyi chaapunu Aahaaramunu taane siddhaparachunu Inti vaarinandarini Kanipettuchundunu Credentials: Singer: Dr. A.R. Stevenson Album: Kalyana Veduka Lyrics and Music: Dr. A.R. Stevenson