Kreesthe Sarwaadhikaari song lyrics click here for this song chords క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి క్రీస్తే సర్వాధికారి… 1. ముక్తి విధాతనేత -శక్తి నొసంగుదాత భక్తి విలాపశ్రోత – పరమంబు వీడెగాన 2. దివ్య పధంబురోసి – దైవంబు తోడుబాసి దాసుని రూపుదాల్చి – ధరణి కేతెంచెగాన 3. శాశ్వత లోకవాసి – సత్యామృతంపురాశి శాప భారంబు మోసి – శ్రమల సహించెగాన 4. సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్ నీతి పధంబు బెంప – రుధిరంబు గార్చెగాన 5. మృత్యువు ముల్లు త్రుంపన్ – నిత్యజీవంబు బెంపన్ మర్త్యాళిభయము దీర్పన్ – మరణంబు గెలిచెగాన 6. పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన ప్రతినాలుక మోకాలు – ప్రభునే భజించుగాన 7. ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు యెహొవా తండ్రి యేసున్ – హెచ్చించినాడుగాన