Kreestu nedu Lechenu song lyrics

1.క్రీస్తు నేడు లేచెను 

ఆ ఆ ఆ హల్లెలూయ 

మర్త్య దూత సంఘమా 

ఆ ఆ ఆ హల్లెలూయ 

భూమి నాకసంబులో 

ఆ ఆ ఆ హల్లెలూయ 

బాడుమిందు చేతను ​

ఆ ఆ ఆ హల్లెలూయ 

 2. మోక్షమియ్య నాధుడు ​

ఆ ఆ ఆ హల్లెలూయ 

యుద్ధమాడి గెల్చెను 

ఆ ఆ ఆ హల్లెలూయ ​

సూర్యుడుద్భవింపగ 

ఆ ఆ ఆ హల్లెలూయ ​

​చీకటుల్ గతియించెను 

ఆ ఆ ఆ హల్లెలూయ ​

3. బండ, ముద్ర, కావలి 

ఆ ఆ ఆ హల్లెలూయ

అన్ని వ్యర్ధమైనవి 

ఆ ఆ ఆ హల్లెలూయ​

యేసు నరకంబును 

ఆ ఆ ఆ హల్లెలూయ

గెల్చి ముక్తి దెచ్చెను ​

ఆ ఆ ఆ హల్లెలూయ

4. క్రీస్తు లేచినప్పుడు  

ఆ ఆ ఆ హల్లెలూయ

చావు ముల్లు త్రుంచెను 

ఆ ఆ ఆ హల్లెలూయ

ఎల్లవారి బ్రోచును 

ఆ ఆ ఆ హల్లెలూయ

మృత్యువింక గెల్వదు 

ఆ ఆ ఆ హల్లెలూయ 

5. యేసు మృతి గెల్చెను 

ఆ ఆ ఆ హల్లెలూయ

మేము కూడ గెల్తుము 

ఆ ఆ ఆ హల్లెలూయ

యేసుడుండు చోటకు 

ఆ ఆ ఆ హల్లెలూయ

మేము కూడ బోదుము 

ఆ ఆ ఆ హల్లెలూయ

6. భూమి నాకశంబులో ​

ఆ ఆ ఆ హల్లెలూయ

యేసు, నీకు స్తోత్రము ​

ఆ ఆ ఆ హల్లెలూయ

మృత్యు సంహారకుండ 

ఆ ఆ ఆ హల్లెలూయ

నీదె నిత్య జయము 

​ఆ ఆ ఆ హల్లెలూయ

​ 
Credentials: Original song by Charles Wesley ( Christ the Lord Risen today)​
Telugu version by : John Aberly
(Collected from Andhra Kraistava Keerthanalu song 222)​