Lechinadura Samadhi Gelchinaadura song Lyrics

లేచినాడురా సమాధి గెలిచినాడురా – యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా

అ.ప. లేతునని తా జెప్పినట్టు – లేఖనములలో పలికినట్టు /లేచి/

1. భద్రముగ సమాధిపైని – పెద్దరాతిని యుంచిరి భటులు 

ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న 

2. ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాతిని పొర్లించి 

భళిర దానిపై కూర్చుండె – భయమునొంద కావలివారు 

3. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు 

శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ 

4. చూడవెళ్లిన స్త్రీలను దూత – చూచి యపుడే వారితోడ 

లేడు గలలియ ముందుగ పోతున్నాడు – అపుడె లేచినాడని 

5. చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తుల కగుపడినాడు 

చచ్చినను నను లేపుతాడు – చావు అంటే భయపడరాదు 

6. నేను చేసే పనులనెరుగు – నేను నడిచే మార్గమెరుగు 

నేను చేప్పు మాటలెరుగు – నేను బ్రతికే బ్రతుకు నెరుగు 

7. నేను లేచిన యేసునందు – మానక మది నమ్ముకొందు – తాను 

నాలోయుండినందున – దయను జేర్చు మోక్షమందు 

8. పాపభారము లేదు మనకు – మరణ భయము లేదు మనకు 

నరక బాధ లేదు మనకు – మరువకండి యేసు ప్రభుని 

9. యేసు నందే రక్షణ భాగ్యం – యేసు నందే నిత్య జీవం 

యేసు నందే ఆత్మ శాంతి – యేసు నందే మోక్ష భాగ్యం 

10. పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడు 

పాపులను ప్రేమించానాడు – ప్రాణదానము చేసినాడు 

Lyrics from : Song number 687 Andhra kraistava keerthanalu (Supplementary )