పల్లవి: లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ (2X) చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క – దుఃఖమే విడిచిపోయె చక్కని చుక్క (2X) /లెక్కలేని/
1. ప్రభువునందు మృతులే మరి ధన్యులని – విభుని చెంత చేరుటయే గమ్యమని (2X) ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2X) /లెక్కలేని/
2. దేహమందు నివశించుట వ్యర్ధమని – మోహమంత మరచుట పరమార్ధమని (2X) ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2X) /లెక్కలేని/
3. పాపలోకమందు బ్రతుకలేమని – ఆ పరమును చే్రుటయే మేలని (2X) ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2X) /లెక్కలేని/
4. యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని – మృతులనుండి తనను తిరిగి లేపునని(2X) ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2X/లెక్కలేని/