Loka paapamunu mosukellina Telugu worship song lyrics లోక పాపమును మోసుకెళ్లిన – దేవుని గొర్రెపిల్ల (2) నీ రక్తమే పాప పరిహారం -నీ దేహమే జీవ ఆహారం నీ వాక్యమే మాకు ఆధారం -నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకును విజయం 1. మొదటి ఆదాముతో – పాపము జనియి౦చెను -మరణము సంక్రమించెను ||2|| ఆ పాపం పోవాలంటే – ఈ మరణం తోలగాలంటే-మా వల్ల కానెకాదు – పరిశుద్దుడె రావాలి…. ప్రభువా కదపటి ఆదామైనావు…కలువరి బలిపీఠమునెక్కావు… నీ ప్రాణమే బలిగా అర్పించి… మా ప్రాణాలను కాపాడావు – మరణాన్నే మింగివేశావు|| నీ రక్తమే|| 2. నీవు పొందిన దెబ్బలచె – మాకు స్వస్థత నిచ్చావే మాకోసం చీల్చబడినావే…||2|| సూరూపమెమిలేక కురుపివైనావయ్యా-నిను నాలుగగొట్టుటకు తండ్రిష్టమాయెనా… ప్రభువా నిశ్చయముగ మా రోగాలు…భరీయించావు నీ దేహములో… మా వ్వసనములన్నిటి సహీయించి… మా శాపగ్రాహివైనావు – ఆరోగ్యమే మాకు ఇచ్చావు.. || నీ రక్తమే|| 3. శ్రీమంతుడవు నువ్వు – సృష్టంతటిలో నువ్వు అయినా తగ్గించుకున్నావు… ||2|| నివు సృస్టించిన ఈ భువికి – దీనుడవై దిగివచ్చావే మము ధనవంతులుగా చేయ – దారిద్ర్యతనొ౦దావె… ప్రభువా నీ తగ్గింపుకు సమమెది?…నీ అద్బుత క్రుపకు మితియేది?.. నీ ప్రేమకు ఇలలో సాటెది?… నీవంటి రక్షకుడు ఏడి – నీ లాంటి ప్రేమ ఘనుడేడి.. || నీ రక్తమే|| Credentials: Lyrics and sung by: Bro. Anil Kumar Album: Jesus my Hero Listen to the song here and sing along with and be blessed