మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి 1. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె దైర్యము “మార్గము” 2. ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ద్వంసము చేసె దేవానిన్ చేరితి దేహియని నీవైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము “మార్గము” 3. దూరదేశములోన భాగుండు ననుకొనుచు తప్పితి మార్గము తరలి పోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము”మార్గము” 4. కొడుకునే కాదనుచు గృహమే చెరశాలనుచు కోపించి వెళ్ళితి కూలి వానిగనైన నీయింట పనిచేసి కనికరమే కోరుదు కాదనకు నాతండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము”మార్గము” 5. నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏతెంచే నా పైబడి ఏడ్చెను నవ జీవమును కూర్చి ఇంటికితోడ్కొనివెళ్ళి నన్ను ధీవించెను నాజీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమైయుండును “మార్గము”