మంచి దేవుడు నా యేసయ్య – చింతలన్ని బాపునయా హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము నిచ్చునయా #2# మహిమ… ఘనత… ప్రభావము.. నీకే.. #2# 1. క్పపల వెంట కృపను చూపి – విడువక నీ కృపలను చూపిన #2# కృపగల నా యేసు రాజ – నీ కృప నాకు చాలునయా #2#మహిమ# 2. మహిమ వెంట మహిమ నొసగి – నీ రూపమున నన్ను మార్చి #2# మహిమలో నీవుండు చోటికి – మమ్ము ప్రేమతో పిలచితివి #2#మహిమ# 3. జయము వెంట జయము నిచ్చి – జయ జీవితము మాకుఇచ్చి #2# జయశీలుడు నా యేసు ప్రభువని – జయము జయమని పాడెదను#2 #మహిమ#